Manasija

Manasija

తెలుగు నా మాతృభాష.నాకెంతో ఇష్టమైన భాష.చక్రవర్తులచేదేశ భాష లందు తెలుగు లెస్సఅని కీర్తింపబడిన భాష.త్రిలింగ దేశపు తీయటి తేనెలొలుకు భాష.పూర్ణ భాష.సంగీతమునకే వన్నె తెచ్చిన భాష.అటువంటి నా భాష నేడు తన ఉనికిని కోల్పొతోంది.

కవిత్రయం మొదలు పోతన,శ్రీనాథుల వంటి కవి సార్వభౌములను,అన్నమయ్య,రామదాసు,త్యాగరాజు వంటి వాగ్గేయకారులను,శ్రీ కృష్ణదేవరాయల వంటి చక్రవర్తులనూ తరింపజేసినట్టి నా భాష ను సంరక్షించుకునేందుకు అర్హమైన శక్తి కాని బుద్ధి కాని నాకు లేకపోయినప్పటికీ……

ఆమె తల్లి..,

నేను బిడ్డను.

ఇంతకన్నా అనుబంధం కావాలి?? అధికారం తోనే(గర్వం గా చెప్పుకుంటున్నాను) ప్రయత్నం చేస్తున్నాను.

ఒక ప్రాంతపు సంస్కృతి,ఆచారం భాష ద్వారానే భావి తరాలకు గ్రంథరూపాల్లో అందించబడతాయి.అటువంటి భాష నేడు కనుమరుగవుతోంది.దానిని కాపాడుకోవాలంటే భాషలొనే మాట్లాడాలి,చదవాలి,వ్రాయాలి.కాలంలో కరిగిపోనీయకుండా ప్రాణం పోయాలి.

సంకల్ప వికల్ప సమాహారమైన మనసులో ఎన్నో అందమైన,మరెన్నో మధురమయిన,గాఢమైన భావాలు.అలా పొందిన,కలిగిన అనుభూతులని

మాతృసేవ లో తరించిన మహానుభావులందరినీ స్మరించి నమస్కరిస్తూమనసిజ పుష్పములు గా వినయంగా భక్తి తో తెలుగు తల్లి పాదారవిందములకు సమర్పిస్తున్నాను.”

-తప్పులుంటే పెద్దమనసుతో మన్నించి , తెలిపి ఆశీర్వదించగలరు.

Wednesday, May 23, 2012

Vennelasantakam




మమతలు ముత్యాలు కలతలు సుడిగుండాలు 
                                          నా ఎదయే సంద్రములే
తలపులు మేఘములు కన్నుల వర్షములు 
                                           మనసు మిన్నేనులే

నీవేమో వెండి జ్యోత్స్నపు ఇందుముఖి వి 

మబ్బుల మాటున నీ రూపం దోబూచులాడే
అలల పైననే తన బింబం కదలి తేలే

మది తేలే ఊహలేవో మేఘాల పల్లకిలో
ఎదనిండిన గురుతులేవో కదలాడే నావ ల్లే 

మనసున ఙాపకాల మాటున దాగి తొంగి చూసేవు
నీ ప్రియ దర్శనం కోసం  ఎద అలలై  ఉప్పొంగి

తనలో నింపుకొంటోంది 
                          నీవు చేసిన వెన్నెలసంతకం   

No comments:

Post a Comment