Manasija

Manasija

తెలుగు నా మాతృభాష.నాకెంతో ఇష్టమైన భాష.చక్రవర్తులచేదేశ భాష లందు తెలుగు లెస్సఅని కీర్తింపబడిన భాష.త్రిలింగ దేశపు తీయటి తేనెలొలుకు భాష.పూర్ణ భాష.సంగీతమునకే వన్నె తెచ్చిన భాష.అటువంటి నా భాష నేడు తన ఉనికిని కోల్పొతోంది.

కవిత్రయం మొదలు పోతన,శ్రీనాథుల వంటి కవి సార్వభౌములను,అన్నమయ్య,రామదాసు,త్యాగరాజు వంటి వాగ్గేయకారులను,శ్రీ కృష్ణదేవరాయల వంటి చక్రవర్తులనూ తరింపజేసినట్టి నా భాష ను సంరక్షించుకునేందుకు అర్హమైన శక్తి కాని బుద్ధి కాని నాకు లేకపోయినప్పటికీ……

ఆమె తల్లి..,

నేను బిడ్డను.

ఇంతకన్నా అనుబంధం కావాలి?? అధికారం తోనే(గర్వం గా చెప్పుకుంటున్నాను) ప్రయత్నం చేస్తున్నాను.

ఒక ప్రాంతపు సంస్కృతి,ఆచారం భాష ద్వారానే భావి తరాలకు గ్రంథరూపాల్లో అందించబడతాయి.అటువంటి భాష నేడు కనుమరుగవుతోంది.దానిని కాపాడుకోవాలంటే భాషలొనే మాట్లాడాలి,చదవాలి,వ్రాయాలి.కాలంలో కరిగిపోనీయకుండా ప్రాణం పోయాలి.

సంకల్ప వికల్ప సమాహారమైన మనసులో ఎన్నో అందమైన,మరెన్నో మధురమయిన,గాఢమైన భావాలు.అలా పొందిన,కలిగిన అనుభూతులని

మాతృసేవ లో తరించిన మహానుభావులందరినీ స్మరించి నమస్కరిస్తూమనసిజ పుష్పములు గా వినయంగా భక్తి తో తెలుగు తల్లి పాదారవిందములకు సమర్పిస్తున్నాను.”

-తప్పులుంటే పెద్దమనసుతో మన్నించి , తెలిపి ఆశీర్వదించగలరు.

Wednesday, March 14, 2012

Krishnaa.....


"పగలంతా వేచిన సంధ్యా కాంత కౌగిట
దిననాథుడు చేరె గోధూళి వేళ

వెండి వెన్నెల విరిసిన పున్నమి రేయి
రేరాజు తారల గూడి మెరసె

మలయ మారుతము వీయ జలధరు కురిసి
ప్రియసఖి చేరగ పురివిప్పి నటనమాడె నీలకంఠి

కుసుమ పరిమళ మిళిత మృదుల పవనము
చేర్చె సుధామధురమత్తను పూఒడి కి

శిఖిపించమౌళియై నీలకాంతి తనువుద్దీపింప


త్రిజగములను స్థంభింపు నీ దివ్య రూపము గని

కరకమలారుణ కాంతి మెరయు మురళీ
మోహన గానమున తనువు మరచి

చందన చర్చిత వదన సరోజము చేరి
కెమ్మోవి సుధారస పానము చేయు వేళ ఎన్నడో...."
                                     కృష్ణా......

No comments:

Post a Comment