Manasija

Manasija

తెలుగు నా మాతృభాష.నాకెంతో ఇష్టమైన భాష.చక్రవర్తులచేదేశ భాష లందు తెలుగు లెస్సఅని కీర్తింపబడిన భాష.త్రిలింగ దేశపు తీయటి తేనెలొలుకు భాష.పూర్ణ భాష.సంగీతమునకే వన్నె తెచ్చిన భాష.అటువంటి నా భాష నేడు తన ఉనికిని కోల్పొతోంది.

కవిత్రయం మొదలు పోతన,శ్రీనాథుల వంటి కవి సార్వభౌములను,అన్నమయ్య,రామదాసు,త్యాగరాజు వంటి వాగ్గేయకారులను,శ్రీ కృష్ణదేవరాయల వంటి చక్రవర్తులనూ తరింపజేసినట్టి నా భాష ను సంరక్షించుకునేందుకు అర్హమైన శక్తి కాని బుద్ధి కాని నాకు లేకపోయినప్పటికీ……

ఆమె తల్లి..,

నేను బిడ్డను.

ఇంతకన్నా అనుబంధం కావాలి?? అధికారం తోనే(గర్వం గా చెప్పుకుంటున్నాను) ప్రయత్నం చేస్తున్నాను.

ఒక ప్రాంతపు సంస్కృతి,ఆచారం భాష ద్వారానే భావి తరాలకు గ్రంథరూపాల్లో అందించబడతాయి.అటువంటి భాష నేడు కనుమరుగవుతోంది.దానిని కాపాడుకోవాలంటే భాషలొనే మాట్లాడాలి,చదవాలి,వ్రాయాలి.కాలంలో కరిగిపోనీయకుండా ప్రాణం పోయాలి.

సంకల్ప వికల్ప సమాహారమైన మనసులో ఎన్నో అందమైన,మరెన్నో మధురమయిన,గాఢమైన భావాలు.అలా పొందిన,కలిగిన అనుభూతులని

మాతృసేవ లో తరించిన మహానుభావులందరినీ స్మరించి నమస్కరిస్తూమనసిజ పుష్పములు గా వినయంగా భక్తి తో తెలుగు తల్లి పాదారవిందములకు సమర్పిస్తున్నాను.”

-తప్పులుంటే పెద్దమనసుతో మన్నించి , తెలిపి ఆశీర్వదించగలరు.

Saturday, August 11, 2012

మనసా మర్చిపో..





వేదన....శోధన...
ఊపిరాగే  భావన...
ద్వేషమా...ప్రాణమా...
చేరువైతే    నేరమా.....

ముళ్ళే ఉండని పూవులుండవా?
కన్నీరు ఉండని కళ్ళు లేవా ?
అలలు ఉండని సంద్రముండదా?
ఏ కలలు ఉండని జన్మ లేదా?

మనసా మర్చిపో లేదంటే చచ్చిపో
గతమా కాలిపో మరుజన్మ కి ఆశ తో ........

గమ్యమే లేదని తెలిసిన పయనమా
చీకటే లోకమా చుక్కల్లో సూరీడా ప్రేమా
భూమి పాతాళం లోతునా పిచ్చి వాడ్నై స్వర్గాన్ని వెతకనా
ఉన్నా ఆకాశం అంచున నువ్వు లేని నా కోసం బ్రతకనా

ప్రాణాలే పోతున్నా నిందించ లేకున్నా
నాలోనే నాతోనే నేనుండ లేకున్నా  

గతమే తీయగా బాధించే హాయి లో లో
పరదా తీయగా కనిపించే నిజమిలా
ఎటు చూడను ఇరు వైపుల ప్రణయాలే ప్రళయమై
వెంటాడితే ఎం చేయను నేనే లేనుగా
ఏ తీరం చేరాలి చుక్కానే లేకుండా
నాదంటు నాకంటు ఉందొకటే నరకం

మనసా మర్చిపో లేదంటే చచ్చిపో  
గతమా కాలి పో  మరుజన్మ కి ఆశ తో............


సాహిత్యం:లక్ష్మి భూపాల్@ అందాల రాక్షసి

No comments:

Post a Comment