Manasija

Manasija

తెలుగు నా మాతృభాష.నాకెంతో ఇష్టమైన భాష.చక్రవర్తులచేదేశ భాష లందు తెలుగు లెస్సఅని కీర్తింపబడిన భాష.త్రిలింగ దేశపు తీయటి తేనెలొలుకు భాష.పూర్ణ భాష.సంగీతమునకే వన్నె తెచ్చిన భాష.అటువంటి నా భాష నేడు తన ఉనికిని కోల్పొతోంది.

కవిత్రయం మొదలు పోతన,శ్రీనాథుల వంటి కవి సార్వభౌములను,అన్నమయ్య,రామదాసు,త్యాగరాజు వంటి వాగ్గేయకారులను,శ్రీ కృష్ణదేవరాయల వంటి చక్రవర్తులనూ తరింపజేసినట్టి నా భాష ను సంరక్షించుకునేందుకు అర్హమైన శక్తి కాని బుద్ధి కాని నాకు లేకపోయినప్పటికీ……

ఆమె తల్లి..,

నేను బిడ్డను.

ఇంతకన్నా అనుబంధం కావాలి?? అధికారం తోనే(గర్వం గా చెప్పుకుంటున్నాను) ప్రయత్నం చేస్తున్నాను.

ఒక ప్రాంతపు సంస్కృతి,ఆచారం భాష ద్వారానే భావి తరాలకు గ్రంథరూపాల్లో అందించబడతాయి.అటువంటి భాష నేడు కనుమరుగవుతోంది.దానిని కాపాడుకోవాలంటే భాషలొనే మాట్లాడాలి,చదవాలి,వ్రాయాలి.కాలంలో కరిగిపోనీయకుండా ప్రాణం పోయాలి.

సంకల్ప వికల్ప సమాహారమైన మనసులో ఎన్నో అందమైన,మరెన్నో మధురమయిన,గాఢమైన భావాలు.అలా పొందిన,కలిగిన అనుభూతులని

మాతృసేవ లో తరించిన మహానుభావులందరినీ స్మరించి నమస్కరిస్తూమనసిజ పుష్పములు గా వినయంగా భక్తి తో తెలుగు తల్లి పాదారవిందములకు సమర్పిస్తున్నాను.”

-తప్పులుంటే పెద్దమనసుతో మన్నించి , తెలిపి ఆశీర్వదించగలరు.

Wednesday, March 14, 2012

Sankharaavam


తొలి వేకువలో ఎద తలుపులలో తలచి
నిశి రాతిరిలో నీలి మబ్బులలో నిలిచి
ఆగని ధారల తడిసి వెదికిన చూపులకలసి
సొలసి వేచిన కనులకి

ఒంటరి వేడి నిట్టూర్పుల సెగ తగిలి
ఒక కంట సూర్యోదయం మరు కంట సూర్యాస్తమయములతో ఎర్రబడుతుంటే

కను రాల్చే నీటిని ఆపమంది
ఓ నిశ్శబ్ద అంతరంగ సందేశం
ఉక్కిరి బిక్కిరి ఆలోచనలకు కళ్ళెం వేయమంది
ఓ తెలిసిన మృదు మధుర సుస్వరం!!!

తలపోసిన వేవీ కొనసాగక పోగా
పరివేదన బరువు బరువు కాగా
అటు చూస్తే ఇటు చూస్తే
చిరునవ్వు ఇవ్వక చేయుతా ఇవ్వక
మురికితనం కరకుతనం
నా సుందర కమల కోమల సుకుమార హృదయానికి గాయం చేస్తే
వంచనలతో నిండిన ఈ లోకంతో పొసగక పోతే
తలచుకున్నప్పుడల్లా తనువులో అణువణువులో
సంవర్త ప్రతివాద భయంకర
జంఝా పవనం రేగుతుంటే

శత కోటి సూర్య ప్రభా భాసుర చక్ర ధారణ చేసి
అఖిల బ్రహ్మాండముల్ పగుల కౌమోదకిన్ భ్రమణం చేసి
గరుడ గమన గగన ఛేదన శస్త్రముల్ సంధింప శార్ఙ్గధరనై
నందక ఖడ్గ ప్రహారముల్ ప్రజ్వరిల్ల
భూనభోంతరాళంబుల్ దద్దరిల్లి ప్రతిధ్వనింప
నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొని
అచింతానంత శాంత సామ్రాజ్య స్థాపనకై
ఈ కదన శంఖం పూరించమంది”!!!!

No comments:

Post a Comment