Manasija

Manasija

తెలుగు నా మాతృభాష.నాకెంతో ఇష్టమైన భాష.చక్రవర్తులచేదేశ భాష లందు తెలుగు లెస్సఅని కీర్తింపబడిన భాష.త్రిలింగ దేశపు తీయటి తేనెలొలుకు భాష.పూర్ణ భాష.సంగీతమునకే వన్నె తెచ్చిన భాష.అటువంటి నా భాష నేడు తన ఉనికిని కోల్పొతోంది.

కవిత్రయం మొదలు పోతన,శ్రీనాథుల వంటి కవి సార్వభౌములను,అన్నమయ్య,రామదాసు,త్యాగరాజు వంటి వాగ్గేయకారులను,శ్రీ కృష్ణదేవరాయల వంటి చక్రవర్తులనూ తరింపజేసినట్టి నా భాష ను సంరక్షించుకునేందుకు అర్హమైన శక్తి కాని బుద్ధి కాని నాకు లేకపోయినప్పటికీ……

ఆమె తల్లి..,

నేను బిడ్డను.

ఇంతకన్నా అనుబంధం కావాలి?? అధికారం తోనే(గర్వం గా చెప్పుకుంటున్నాను) ప్రయత్నం చేస్తున్నాను.

ఒక ప్రాంతపు సంస్కృతి,ఆచారం భాష ద్వారానే భావి తరాలకు గ్రంథరూపాల్లో అందించబడతాయి.అటువంటి భాష నేడు కనుమరుగవుతోంది.దానిని కాపాడుకోవాలంటే భాషలొనే మాట్లాడాలి,చదవాలి,వ్రాయాలి.కాలంలో కరిగిపోనీయకుండా ప్రాణం పోయాలి.

సంకల్ప వికల్ప సమాహారమైన మనసులో ఎన్నో అందమైన,మరెన్నో మధురమయిన,గాఢమైన భావాలు.అలా పొందిన,కలిగిన అనుభూతులని

మాతృసేవ లో తరించిన మహానుభావులందరినీ స్మరించి నమస్కరిస్తూమనసిజ పుష్పములు గా వినయంగా భక్తి తో తెలుగు తల్లి పాదారవిందములకు సమర్పిస్తున్నాను.”

-తప్పులుంటే పెద్దమనసుతో మన్నించి , తెలిపి ఆశీర్వదించగలరు.

Wednesday, March 14, 2012

Premalekha


కునుకుని మరచిన కనులకి కలవి నువ్వనీ
నీ తలపుల నా మదికెన్నడు అలసట లేదనీ

చెంత నున్న వేళ కాలమునకు విలువ లేదనీ
దరి లేని  క్షణములు యుగములనీ

నీ తీయని తలపులు ఉదయపు మేలుకొలుపులనీ
నిను కలిసిన గురుతులే జోలపాటలనీ

దారి తెలియక నా పదములు నీ  వెనుకనే సాగెననీ
విసిగి మరి నీ  అడుగుల జతను కోరెననీ

నీ నిచ్ఛ్వాసను నిండిన గాలి నా హృదయమునకు ఊపిరైనదనీ
ఊపిరై అణువణువున నిను నాలో  నింపెననీ

తొలి చూపులు నను తాకిన క్షణములు మరువననీ
కడదాక పట్టిన చేయి విడువననీ

నిను చూసి మురిసిన మనసుని నీతో చెప్పాలని
వ్రాసెను నా మది రుధిరాక్షరాల ప్రేమలేఖనీ……..

No comments:

Post a Comment